Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మండల కేంద్రంలో గల ఆర్ఓబి బ్రిడ్జి పై వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రింగు రోడ్డు ఏర్పాటు చేయాలని బోనకల్ అఖిలపక్ష నాయకులు గురువారం మధిర ఆర్అండ్బి డిఈ కట్ట రాజశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. మండలంలో నెలకొన్న ఆర్అండ్బి రోడ్ల సమస్యలపై మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆర్అండ్బి అధికారులతో మండల ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు కొద్దిమంది మినహా ఎవరో హాజరు కాలేదు. మండలంలో ఆర్అండ్బి రోడ్ల సమస్యలపై డిఈ, ఏఈలకు మోటమర్రి సర్పంచ్ కేతినేని ఇందు గోవిందాపురం ఏ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు తమ తమ రోడ్ల పరిస్థితులను ఆర్అండ్బి అధికారులకు వివరించారు. మోటమర్రి సర్పంచ్ కేతినేని ఇందు మాట్లాడుతూ కలకోట- మోటమర్రి రోడ్డుపై విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి మోటమర్రి వరకు రోడ్డు అత్యంత దారుణంగా ఉందన్నారు. ఈ రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని డిఈ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. గోవిందాపురం ఎల్ లోనే ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ముందు రోడ్డు ఫై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు డిఈ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలం సమయంలో పాఠశాల ముందు చెరువుల తలపిస్తుందని వివరించారు.
ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ బోనకల్ చిరునోముల రోడ్డు గురించి వివరించారు. ప్యాచ్ వర్క్ లకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని డిఈ అన్నారు. ఆర్ఓబి బ్రిడ్జిపై లైటింగ్ ఏర్పాటు కోసం విద్యుత్ ఉన్నత అధికారులు ఎస్టిమేట్ వేయాలని అది ఆర్ అండ్ బి పరిధిలోది కాదని డిఈ ఎంపీడీవోకి తెలిపారు. అనంతరం బోనకల్ గ్రామ అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో డీఈ, ఎంపీడీవోలకు ఆర్ఓబి బ్రిడ్జి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దెబ్బతిన్న రోడ్లలకు వెంటనే మరమ్మతు చేయాలని, లేనియడల ఉద్యమాలు చేస్తామని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తెలిపారు. వినతి ఇచ్చిన వారిలో సిపిఎం బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు, బోనకల్ పంచాయతీ పాలకవర్గ సభ్యుడు ఉప్పర శ్రీను, సిపిఎం నాయకులు బిల్లా విశ్వనాథం, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరరావు, టిఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ గ్రామ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, మరీదు శ్రీనివాసరావు, గంగుల శ్రీనివాసరావు మాటమర్రి తదితరులు ఉన్నారు.