Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
కోతుల నియంత్రణ చర్యలు చేపట్టి వ్యవసాయ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం వైరా మండలం గన్నవరం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కోతులను నియంత్రించి పంటలను రక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించి సర్పంచ్ వేమిరెడ్డి విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టుబడితో రైతులు పంటలు పండిస్తే నిమిషాలు వ్యవధిలో కోతులు పంటలను నాశనం చేస్తున్నాయని అన్నారు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కోతులు భారీ నుంచి పంటలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. రైతులపై కోతులు దాడి చేస్తున్నాయని, రైతులు భారీగా నష్టపోతున్నారని, పత్తి పంట కాపు దశ నుంచి మూడు నెలల పాటు అదనపు ఖర్చు 30వేలు కాపలా వ్యక్తికి చెల్లించాల్సి వస్తుందని, రైతులు ఇంటికి రెండు కుక్కలను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మందడపు ఉపేందర్, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు బాణాల శ్రీనివాసరావు, శీలం వెంకటరెడ్డి, ఎస్.కె జానిమీయా, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తూము సుధాకర్, సిఐటియు మండల కన్వీనర్ బాజోజు రమణ, నీటి సంఘం మాజీ చైర్మన్ వేమిరెడ్డి కోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కారుమంచి జయరావు, తదితరులు పాల్గొన్నారు.