Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరైన సమయంలో విద్యుత్ బిల్లుల రీడింగ్ తీసి ఇవ్వాలి
- ఎస్ఈ సురేందర్‌కి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరంలో నెలనెలా విద్యుత్ బిల్లులు తీయకపోవడంతో నెల రోజుల దాటిన తర్వాత స్లాబ్ రేటు పెరిగి పేద ప్రజలపై భారం పడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం విద్యుత్ ఎస్ఇ సురేందర్‌కు సిపిఎం ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా 30 రోజుల లోపల ప్రతి ఇంటికి తిరిగి విద్యుత్ బిల్లులు తీసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు 30 రోజులకు బిల్ తీయాలి కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజుల వరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారన్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్‌కి 3.60 రూపాయలు అని, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 2 రోజులు డిలే చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్‌తో కలిపి 106 యూనిట్స్ వస్తుందన్నారు. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు పడడం వల్ల పేద ప్రజలపై భారం పడుతుందని వారన్నారు. ఎస్ఇ సురేందర్ మాట్లాడుతూ భవిష్యత్తులో అధునాతన యంత్రాలు ఉపయోగించి విద్యుత్ బిల్లుల రీడింగ్ తీస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై విక్రమ్, జిల్లా కమిటి సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, జిల్లా నాయకులు తుషాకుల లింగయ్య, అర్బన్ మండల కార్యదర్శి బి.ఉపేందర్, టూ టౌన్ నాయకులు కాంపాటి వెంకన్న పాల్గొన్నారు.