Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్తో సహా నాయకులంతా అదే బాట
నవతెలంగాణ- చింతకాని
రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో చింతకాని నేతలు హల్చల్ చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు ఇంటింట ప్రచారం ఆత్మీయ సభలు రోడ్ షోలతో అన్నింట ముందు వరుసలో ఉంటున్నారు. వాల్ పోస్టర్లు అతికించడం నుంచి అన్ని తామే చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్తో సహా అధికార పార్టీ నేతలు అక్కడే మకాం వేశారు. మునుగోడు ఉపఎన్నిక నవంబర్ 7వ తేదీన జరగనుండడంతో ప్రచారం చివరి దశలో ఉంది. ఈ సమయంలో ఎంత మేర ఓటర్లను ఆకర్షించామన్న అంశంపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం తమ సాయి శక్తుల ప్రయత్నిస్తున్నాయి. చేతికొచ్చిన ఏ అవకాశాన్ని జారవిడవడం లేదు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. చింతకాని జడ్పిటిసి పర్చగాని తిరుపతి కిషోర్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు మంకెన రమేష్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెంట్ల పుల్లయ్య, నాగులవంచ సహకార సంఘం చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, డైరెక్టర్ వంకాయలపాటి వెంకట లచ్చయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.