Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలమాల
నవతెలంగాణ- సత్తుపల్లి
దేశాన్ని అప్పుల పాల్జేస్తూ, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ, పేదలపై భారాలు మోపుతూ కేంద్రంలో ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని, ఇదే కొనసాగితే దేశంలోని ప్రజలందరూ ఆకలితో మలమల మాడే ప్రమాదం పొంచి ఉందని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలమాల విఠల్రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విఠల్రావు మాట్లాడారు. రానున్న కాలంలో కార్మికులు పెద్దఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖరరావు, జిల్లా కమిటీ సభ్యులు కొలికిపోగు సర్వేశ్వరరావు, అంగన్వాడీ, టాక్సీ, ఆటో, సింగరేణి, హౌటల్ వర్కర్ల సంఘ నాయకులు ఉదయశ్రీ, సకీనా, నాగేంద్ర, రాజేశ్, హకీం, కరీం, రాము, ప్రకాశ్, హరిబాబు పాల్గొన్నారు.