Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓసీ దుష్పలితాలను అధికమించి అభివృద్ధి : సర్పంచ్ బానోత్ బన్సీలాల్
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీని ఆభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు సర్పంచ్ బానోత్ బన్సీలాల్ అన్నారు. శుక్రవారం ఉసిరికాయపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ ప్రభావిత గ్రామం కావటంతో ఓసీ దుష్పలితాలతో వస్తున్న సమస్యల అధికమించి అభివృద్ది చేస్తున్నామన్నారు. సింగరేణి కాలరీస్, ప్రజాప్రతి నిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధిలో రాజీ లేకుండా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంచాయతీకి సింగరేణి కాలరీస్ సంస్ధ నుండి రూ.72 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. జీపీ నిధులు రూ.5లక్షలు, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.5 లక్షలు, ప్రధాన మంత్రి ఆది ఆదర్షయోజన నిధులు రూ.10లక్షలు మొత్తం రూ.20 లక్షలతో సీసీ రోడ్లు వేయటం జరిగిందని తెలిపారు. ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ ఆలయం నుండి సీతారాంపురం వరకు బీటీ రోడ్డుకు రూ.5.90 కోట్లు మంజూరైనాయన్నారు. మెగా పల్లె పకృతి వనంను పంచాయతీకి రప్పించి పచ్చదనానికి ప్రముఖ్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీలో సైడ్ డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని దానిని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సహకారంతో అధికమించటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో గ్రామస్తులతోపాటు అధికారుల పాత్ర ఉందన్నారు. గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్దికి కృషి చేస్తానన్నారు.