Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎస్టిఎఫ్ఐ పిలుపుమేరకు టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు భూపతి ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మాట్లాడుతూ సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత రాష్ట్రపతికి సంతకాలతో కూడిన మెమోరాణాన్ని అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సిపిఎస్ ను రద్దు చేశాయని అదే విధంగా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జిపిఎఫ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తొలుత ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు బాలిన చలపతిరావు సంతకం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర చారి, హరి ప్రసాద్ టీఎస్ యుటిఎఫ్ మండల ఉపాధ్య క్షులు కంభం రమేష్, సౌభాగ్య లక్ష్మి, పద్మజ, కార్యదర్శి గోపాలరావు, నాయకులు శ్రీనివాసరావు, సురేష్, రామారావు, సధా బాబు, జిల్లా కోటయ్య, లవకుశ తదితరులు పాల్గొన్నారు.