Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్టల్ మెనూ, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
పెండింగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని, హాస్టల్ మెనూ, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శనగా వెళ్ళి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో రూ.250 కోట్ల పైచిలుకు విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందనీ, పెంచిన ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజులు తగ్గించాలని, హాస్టల్ విద్యార్థులకు మెనూ చార్జీలు పెంచాలని, సంక్షేమ హాస్టళ్లలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఏఎన్ఎంలను నియమించాలని, కొత్తగూడెంలోని కెఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల్వంచ ఎస్సీ గురుకులం ప్రహరీగోడ వద్ద నిర్మించిన దేవతల విగ్రహాలు తొలగించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా స్థానికంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు అధికారుకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు సండ్ర భూపేందర్, సాంఘిక సంక్షేమ తల్లిదండ్రుల సంఘం జోనల్ ఇంచార్జీ కంచపోగు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, జిల్లా సహాయ కార్యదర్శి బోడ అభిమిత్ర, జిల్లా కమిటీ సభ్యులు కిషోర్, యశ్వంత్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు రామ్ చరణ్, పట్టణ కార్యదర్శి నాగ కృష్ణ, గర్ల్స్ నాయకురాలు అఖిల, నాయకులు పవన్, అజిత్, భవ్య తదితరులు పాల్గొన్నారు.