Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం
నవతెలంగాణ-పినపాక
ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం అపహాస్యం పాలు చేస్తూ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయని, ఈ నాటకాలకు త్వరలోనే ముగింపు పలికే రోజులు వస్తున్నాయని పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం విమర్శించారు. పీసీసీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆదేశాల మేరకు బయ్యారం క్రాస్ రోడ్ నందు గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో మోడీ పాలన, రాష్ట్రంలో కేసీఆర్ పాలన అవినీతిమయంగా మారిందని మునుగోడు ఎన్నికలు ఉన్నందున అక్కడి ఓటర్లు ఈ రెండు పార్టీలకు తగ్గిన బుద్ధి చెప్పాలని రాష్ట్రవ్యాప్తంగా కోరుకుంటున్నారన్నారు. 400 కోట్ల అవినీతి సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదా, రాష్ట్ర ప్రభుత్వానిదా అనే విషయాన్ని తక్షణమే విచారణ జరిపించి ప్రజాక్షేత్రంలో పోలీస్ శాఖ నిజనిజాలను నెగ్గుతేల్చి దోషులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, పట్టుబడిన నగదును సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీ స్టీఫెన్ రవీందర్ కేసును తప్పు దోవ పట్టిస్తూ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించే విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీనివాసరావు, మహిళా మండల అధ్యక్షురాలు పాయం సమ్మక్క, పూనం వెంకటేష్, వీరముష్టి మురళి, మునిగల వెంకటేశ్వర్లు, అత్తి లక్ష్మీనారాయణ వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, సర్వేశ్వరరావు, సదాశివరావు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.