Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-బూర్గంపాడు
పల్లెలు, పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. మండలంలో 4వ రోజు అనునిత్యం ప్రజలకు కోసం కార్యక్రమంలో భాగంగా సారపాక గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగర్, పుల్లయ్య క్యాంపు, పాలకేంద్రం, ఏరియాలలో ఆమె విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కాలనీలలో పర్యటించి సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు. తాగు నీరు, డ్రైనేజీ రహదారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేయాలని ప్రజలు ఆమె దృష్టికి ప్రజలు తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ప్రజలవద్దకు వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సారపాక బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ చందర్, సారపాక టౌన్ యూత్ ప్రెసి డెంట్ కొమ్ము లక్ష్మీ చైతన్య రెడ్డి, కార్యదర్శి భూక్య చిరంజీవి, పార్టీ నాయకులు బెజ్జంకి కనకాచారి, బాలాజీ, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, ఆంజనేయులు, రమాదేవి, కోటేశ్వరరావు, నాగ, సాయి బాబా, అరుణ్ ప్రసాద్, యువజన నాయకులు పాల్గొన్నారు.