Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీపీ, షుగర్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్ కడకంచి పద్మ
నవతెలంగాణ-ఇల్లందు
ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని 13వ వార్డు కౌన్సిలర్ కడకంచి పద్మ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీపీ, షుగర్ మందుల కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ, షుగర్‌తో బాధపడుతున్న రోగులకు ఇంటి వద్దకే ఉచితంగా కేసీఆర్ కిట్టు ద్వారా మందులను నెలకు సరిపడేలా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఆర్థిక భారాన్ని దావఖానాల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసిందని అన్నారు. ఈ కిట్టులో మందులతో పాటు వాటిని వినియోగించే తీరును వివరించే సమాచార పత్రాలు ఉంటాయని అన్నారు. నిరక్షరాసులు సైతం సులువుగా తెలుసుకోనేలా కిట్‌లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి మందులను వేరుగా ఉంచుతారని వృద్ధులకు అనుకూలంగా ఉండేలా వీటిని ఒక బ్యాగు రూపంలో అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమనికి పీహెచ్సి ఎన్.భద్రమ్మ, రమణారెడ్డి, ఏఎన్ఎంలు విజయ, కనక రత్నం, లలిత, ఆశా వర్కర్ లత, అంగన్వాడీ టీచర్లు విజయ్ కుమార్, నాగమణి, అంగన్వాడి ఆయా షాహిన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.