Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎఫ్ఓ లక్ష్మణ్రంజిత్ నాయక్
నవతెలంగాణ-మణుగూరు
విద్యార్దులు ఉన్నత లక్ష్యంతో చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా డీఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినా ఫ్రేషర్స్డే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీఎఫ్ఓ, డీఎస్పి రాఘవేంద్రరావు పాల్లొని మాట్లాడుతూ నేటి విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. క్రమశిక్షణ కలిగిన జీవన విధానంతో లక్ష్యాలు సాధించాలన్నారు. విద్యా ర్దులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాప కులు అనిల్ కుమార్, డాక్టర్ అనురాధ, ఎండి కరీమ్, రమేష్‌బాబు, రామతిరుపతి, భాస్కరరావు, సాంబమూర్తి, అశోక్, నాగిరెడ్డి, జబ్బార్, సతీష్, శీరీష, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.