Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతుల్లో ఉపాధ్యాయులు ముందుగానే పాఠ్యాంశాలను చదివి వారికి బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ ఉపాధ్యాయులకు చూసించారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయ ంత్రం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని ఒక తరగతకి ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెట్లు బోధించ వద్దని తరగతి గదుల్లో ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ మాటా ్లడాలని ముఖ్యంగా ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులు రాసే ప్రతి నోట్ బుక్ కరెక్షన్ చూడాలని ఉపాధ్యా యులకు చూసించారు. అనంతరం అన్నదైవం ఎంపీపీఎస్ పాటశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనులను పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానట రింగ్ అధికారి నాగరజశేఖర్, మండల మానాటరింగ్ అధికారి మోహన్ రావు, మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రుగొండ : ఉపాధ్యాయులు ప్రిపేర్ అయ్యి పాఠ్య అంశాలు అంశాలు బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమేశ్వర శర్మ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు మండల స్థాయి సమీక్షా సమావేశం నందు ఆయన పాల్గొని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. బోధనా అభ్యనిర్వహించారు. సామగ్రి వినియోగించాలి, పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి వుండాలి అన్నారు. ప్రతి రోజు చివరి పీరియడ్ నందు ఎక్కాలు, తెలుగు పద్యాలు, ఇంగ్లీషు పదాలు చెప్పించాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, మండల మాని టరింగ్ ఆఫీసర్ సంజీవరావు, ఎంఈఓ సత్యనా రాయణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉండేటి ఆనంద్ కుమార్, వెంకటరమణ, మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.