Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి
- మధ్యాహ్నం భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమా
నవతెలంగాణ - ఎర్రుపాలెం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథక కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటూ, వారి కష్టాన్ని దోపిడీ చేస్తున్నారని, కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమా పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం మండల వనరుల కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మి కుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాని కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లా డుతూ ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజన ప థకం అమలు పరచడం వలన విద్యార్థుల హాజరు శాతం పెరుగు తుందని, డ్రాప్ అవుట్ నిరోధించటానికి దోహద పడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను కల్పించాలని, ఉపాధ్యాయుల ఖాళీలను పూరించాలని, మన ఊరు - మన బడి పథకాన్ని ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు నిధులు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కషి చేయాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర రావు, జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు వర్ధన్, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ రమ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు, మండల కన్వీనర్ సగ్గుర్తి సంజీవరావు, మండల అధ్యక్ష కార్యదర్శులు మేరీ సరోజిని పాల్గొన్నారు.
చింతకాని : నవంబర్ 4,5 తేదీల్లో హైదరాబాదులో జరగనున్న అఖిల భారత మిడ్డేమీల్ వర్కర్స్ ఫెడరేషన్ రెండవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ పిలుపునిచ్చారు. శుక్రవారం చింతకాని మండల మిడ్డేమీల్ వర్కర్స్ మండల మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54,201 మంది 25 వేల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారని పెరిగిన ధరలతో పోల్చితే కేటాయించిన బడ్జెట్ సరిపోక ధరల పెరుగుదలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణు వర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు మడుపల్లి గోపాలరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పిన్నింటి రమ్య, సిఐటియు మండల కన్వీనర్ గడ్డం రమణ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ప్రమీల రాణి తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం కదలి రండి కార్మికులారా అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పెనుబల్లి మండల పరిధిలోని వి.యం బంజరలో జరిగిన సీఐటీయూ మండల 7వ మహాసభలో పాల్గొన్న కళ్యాణం మాట్లాడుతూ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాదిమంది కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గాలికొదిలేసి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. నాయకులు ఎస్వి రమ, తుమ్మా విష్ణు వర్ధన్, పి రమ్య, చలమాల విఠల్రావు, మల్లూరు చంద్రశేఖర్, కొలికిపోగు సర్వేశ్వరరావులు ప్రసంగించారు. ముందుగా పట్టణంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినదిస్తూ భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. మహాసభ ప్రాంగణం వద్ద సీఐటీయూ జెండాను టైలర్ల సంఘం సీనియర్ నేత షేక్ అబ్దుల్లా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ భవన, హమాలీ, టైలరింగ్, మిడ్ డే మీల్స్ తదితర రంగాల కార్మికులు మూడు వందలమంది పాల్గొన్నారు.
జోలెపట్టి విరాళాలు సేకరణ
నవంబర్ 4,5 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న సీ.ఐ.టీ.యు అనుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఫెడరేషన్ అఖిల భారత మహాసభల జయప్రదం కోరుతూ నిర్వహణ కోసం పెనుబల్లిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి. రమ జోలిపట్టి విరాళాలు సేకరించారు.
బోనకల్ : మధ్యాహ్న భోజన కార్మికులు సకాలంలో బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిలభారత మిడ్ డే మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల మండల స్థాయి బాధ్యుల సమావేశం కుశలమ్మ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అఖిలభారత మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రెండో జాతీయ మహాసభలు నవంబర్ 4, 5 హైదరాబాదులో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ మహాసభలకు బోనకల్ మండలం నుంచి మధ్యాహ్న భోజన వర్కర్లు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు రమ్య, సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, నాయకులు గుగులోతు నరేష్, ఎం.రామనరసమ్మ, నాగమణి, సాగర్, లక్ష్మి, మోర్ల అనసూయ పాల్గొన్నారు.
మధిర : ఎంఈవో కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్, సహాయ కార్యదర్శి శీలం నరసింహారావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ రమ్య, మండల బాధ్యులు పడకంటి మురళి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : మధ్యాహ్నం భోజనం వర్కర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని మధ్యాహ్న భోజన వర్కర్ల ఆల్ ఇండియా కార్యదర్శి రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముదిగొండ హైస్కూల్ యందు మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమావేశం ఆసంఘం నాయకురాలు నాయిని నాగలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈసమావేశంలోసిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శ తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, నాయకురాలు రమ్య, సిఐటియు మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, ముదిగొండ సొసైటీ వైస్ చైర్మన్ బట్టు పురుషోత్తం పాల్గొన్నారు.