Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను కాలరాస్తున్నాయని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల కేంద్రంలో సిఐటియు మండల మహాసభ బూర్గుల అప్పచారి అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలుత సంతాప తీర్మానాన్ని బోయినపల్లి వీరబాబు ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో కళ్యాణపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా అమలవుతున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, కార్మికుల కుటుంబాలను వీధిపాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు సమ్మె చేసే హక్కు ఉండకూడదని బెదిరిస్తున్నారని విమర్శించారు. అనేకమంది సంఘటిత, అసంఘటిత కార్మికులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు నివేదికను ప్రవేశపెట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం నరసింహారావు మాట్లాడారు. ఈ మహాసభలో సిఐటియు నాయకులు గూగులోతు నరేష్, మందడపు శ్రీనివాసరావు, షేక్ ఖాదర్ బాబా, బుక్య శ్రీను, రాయల విజయలక్ష్మి, రామణ సరోజినీ, గండు శివ నాగేంద్ర, షేక్ మేరా సాహెబ్, తాళ్లూరి ఏసు రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, బిల్లా విశ్వనాథం, ఉప్పర శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సీఐటియు మండల కన్వీనర్ గా 'వీరబాబు'
సీఐటియు మండల కన్వీనర్‌గా ముష్టికుంట గ్రామానికి చెందిన బోయినపల్లి వీరబాబు మండల కో కన్వీనర్లుగా రావినూతల గ్రామానికి చెందిన గుగులోతు నరేష్ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మందడపు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా షేక్ ఖాదర్ బాబా, షేక్ మీరా సాహెబ్, గండు శివ నాగేంద్ర, రాయల విజయలక్ష్మి, రామణ సరోజని, గుంటి శ్రీను లతో పాటు మొత్తం 17 మందిని ఎన్నుకున్నారు.
వైరా టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా రానున్న కాలంలో పోరాటాలను ఉధతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక బోడెపుడి భవనం నందు సిఐటియు వైరా రూరల్ మండలం మహాసభ ఆళ్ల శీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జెండాను జిల్లా నాయకులు తోట నాగేశ్వరావు ఎగురవేసి మహాసభను ప్రారంబించారు. అనంతరం సీఐటియు నూతన వైరా మండల కమిటీని 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిఐటియు వైరా మండలం కన్వీనర్ గా బాజోజు రమణ, కో-కన్వీనర్ గా ఆళ్ల శ్రీను, కోశాధికారిగా ఎస్.కె మజీద్ తోపాటు 13మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ మహాసభలో గ్రామ దీపికలు, గ్రామ పంచాయతీ, బిల్డింగ్ వర్కర్స్, పెయింటింగ్ కార్మికులు తదితర సంఘాల నుంచి షహనాభి, మజీద్ భీ, రేహనాభి, గొర్రెముచ్చు అనందరావు, గొర్రెముచ్చ నవీన్, బాలస్వామి, సంగెపు నరసింహారావు, మడిపల్లి పాల్గొన్నారు.
సిఐటియు నూతన కన్వీనర్ గా బాజోజు రమణ
సిఐటియు వైరా రూరల్ మండల కన్వీనర్ గా వైరా మండలం వల్లాపురం గ్రామస్తులు బాజోజు రమణ, కో కన్వీనర్ గా గొల్లెనపాడు గ్రామస్తులు ఆళ్ల శ్రీను, కోశాధికారిగా పాలడుగు గ్రామస్తులు ఎస్.కె మజీద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.