Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టీఎస్‌యుటిఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-కామేపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సిఆర్టీ సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని వారు కోరారు. టీఎస్ యుటిఎఫ్ 9వ మండల మహాసభలు మండల అధ్యక్షులు ఎం.నరసింహ రావు అధ్యక్షతన జరిగినది. ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు జివి నాగమల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు డిఎస్.నాగేశ్వరరావు బి.మంగీలాల్, పి.సురేష్, మండల ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రావు, మండల నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఎం. సోమయాచారి, ఈ.కృష్ణా నాయక్, సంధ్యారాణి, మోహన్ రావు, ఎస్కె నాగుల్ మీరా, శ్రీధర్, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నూతన మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎం.నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులుగా ఈ. కృష్ణా నాయక్, ఎం.విజయ శ్రీ, కోశాధికారిగా ఎం.సోమయ్య చారి, మహిళా కార్యదర్శిగా పి.సంధ్యారాణి, ఆడిటర్‌గా ఏ.వెంకట నర్సయ్యలు ఎన్నికైనారు.