Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
డిసెంబర్ 5, 6, 7 తేదీలలో ఖమ్మం నగరంలో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం కోరుతూ ఆదివారం మండలంలోని చెరువుమాదారం నేలకొండపల్లి గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ(ఎం) గ్రామ శాఖల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ మహాసభల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కెవి రామిరెడ్డి మాట్లాడారు. ఈ మహాసభలకు కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభలలో రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యచరణను రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దుగ్గి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మందడపు మురళీకృష్ణ, కూరపాటి అప్పారావు, కూచిపూడి శ్రీదేవి, ఎరదేశి నరసింహారావు, ఎస్కే మజీద్, పాలకుర్తి బోడయ్య, నాగవెల్లి తిరపయ్య, పాలకుర్తి స్వామి, ఎస్కే మహిమూద్, బి రెడ్డి యాకయ్య, నూకతోటి లక్ష్మయ్య, కె.వి చారి తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డు రవికి రివార్డు అందించిన వైరా ఏసీపీ రెహమాన్
నవతెలంగాణ-మధిర
సమన్లలో ఫంక్షనల్ వర్టికల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో హౌంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గోకుల రవికి వైరా ఏసిపి రెహమాన్ ఆదివారం రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర సిఐ మురళి, టౌన్ ఎస్సై సతీష్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.