Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మండల పరిధిలోనే కలకోట- రాయన్నపేట ప్రధాన రహదారి రోడ్డుకు ఇరువైపుల పచ్చని చెట్లతో సుందర వనంగా, ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది. హరితహారంలో భాగంగా ఆ రెండు గ్రామాల సర్పంచులు యంగల దయామణి, కిన్నెర వాణి రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు వేశారు. ఆ మొక్కలు నేడు చెట్లు గా పెరిగాయి. ఈ రోడ్డుపై వెళ్తుంటే ఎంతో అద్భుతంగా అందంగా వాతావరణం కనిపిస్తుంది. ఈ రోడ్డును స్ఫూర్తిగా తీసుకొని మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ తమ రహదారులు వెంట చెట్లు పెంచితే బీచ్, పార్కులను మైమరిపించే విధంగా గ్రామాలు పచ్చదనాన్ని వెదజల్లుతూ ఉంటాయని పలువురు అంటున్నారు.