Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నించిన రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు
- ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ బాధిత కుటుంబ సభ్యులు
- అడ్డుకున్న గ్రామస్తులు
నవతెలంగాణ-కరకగూడెం
ఎన్నో ఏండ్లు నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని తీవ్రమానస్థాపానికి గురైన బాధిత మహిళ ఆత్మహత్యాయనికి పాల్పడ్డా సంఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కరకగూడెం గ్రామానికి చెందిన పఠాన్ మునీర్ ఖాన్‌కు మండలంలో సుమారు రెండు ఎకరాల 34 గంటల సాగు భూమి ఉంది. ఈ పొలంలో పట్టాదారుడు మొక్కజొన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తాటిగూడెం గ్రామపంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శి వీరన్న, మండల ఎన్ఆర్ఈజీసీ జేఈ బక్కయ్య, మా పట్టా భూమిలో ఉన్న మొక్కజొన్న పంటను వారి ఆధ్వర్యంలో దౌర్జన్యంగా ట్రాక్టర్‌తో తొలగించడం జరిగిందని బాధితుడు తెలిపారు. ఈ పట్టా భూమిలో వేసుకున్న మొక్కజొన్న చేనుకు ఎటువంటి అనుమతులు లేవు మీ పొలం పోకుండా ఉండాలంటే రూ.50 వేల ఇవ్వాలని, లేకుంటే ఈ భూమిని స్వాధీనం పరుచుకుంటామని హెచ్చరించాడని బాధితుడు తెలిపాడు. ఈ విషయమై భూమి పట్టాదారుడు గ్రామపంచాయతీ సర్పంచ్, గ్రామస్తులు, అధికార నాయకులు చెప్పగా వారు తాటిగూడెం సెక్రటరీను వివరణ అడగగా మాకు ఎటువంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం తెలిపారు. ఈ విషయమై తాటిగూడెం కార్యదర్శి వీరన్న, ఎన్ఆర్ఈజీసీ జెఈ బక్కయ్యని వివరణ కోరగా మాకు తహసీల్దారు కార్యాలయం నుండి వచ్చినటువంటి సమాచారం మేరకు ఆర్ఐ రాజు ఇచ్చినటువంటి పంచనామా ప్రకారం మేము తొలగించామని సమాధానం చెప్పి వెళ్లారు. ఈ విషయంపై కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.