Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథ ట్రైల్ పరిశీలించిన చైర్మన్
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపల్ పరిధిలోని ఈ రెండో వార్డు ఇల్లందులపాడుకు దశాబ్దాల నుండి నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పక్కనే చెరువు ఉన్నప్పటికీ తాగడానికి నీరు కరువు. ఇది ఇల్లందు పాడు నివసిస్తున్న ప్రజల గోడు. ఎమ్మెల్యే హరిప్రియ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ కటకం పద్మావతి కృషితో నీటి సమస్య తీరింది. నిర్మాణం పూర్తయి 13 సంవత్సరాలుగా నిరుపయోగం ఉన్న కాళీ మాత వాటర్ ట్యాంకును ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచనల మేరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే ట్యాంక్ నుండి ఇల్లందు పాడు, సత్యనారాయణపురం ప్రజలకు నీరు అందించేందుకు మిషన్ భగీరథ పైపుల ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ఆదివారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు స్థానిక వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి పరిశీలించారు. అతి త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కాళీమాత ట్యాంకు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ డిపిఎం విజయ్, రెండో వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.