Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
- కేసు సంపూర్ణ విచారణ జరపాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామంలో బాలికపై 30 ఏండ్ల కాకా వీరరాఘవులు ఈనెల 24వ తేదీన చేను వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినా ఎస్ఐ పట్టించుకోలేదని ఆరోపించారు. బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, కేసు సంపూర్ణ విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. ఆదివారం తీవ్ర మనోవేదనతో బాధితురాలి తల్లి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంఘటన తెలుసుకున్న సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ ఇది పోలీసులు చేసిన హత్యేనని ఆరోపించారు. బాధితులపై లైంగికదాడి కేసు నమోదు చేయాకుండా ఎస్ఐ ఎందుకు కాలయాపన చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతికి అలవాటు పడిన ఎస్ఐ సాటి మహిళ అనిచూడకుండా అత్యాచారం జరిగిందని ఫిర్యాదు ఇచ్చినా, కనీసం వైద్య పరీక్షలు కూడా చేయడానికి ఆసుపత్రికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. పోలీసు, చట్టం బాధితుల పక్షాన నిలిచి ఉంటే ఒక నిండు ప్రాణం బతికేదన్నారు. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే బాధితురాలి తల్లి వెంకటరమణ ఆత్మహత్య చసుకుందని అవేదన వ్యక్తం చేశారు.