Authorization
Mon March 31, 2025 01:34:50 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
దేశంలో బీజెపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని స్థానిక టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాయం నరసింహారావు, షేక్ బాబా డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొమరం సతీష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కొమరం వెంకటేశ్వర్లు, ఉమ్మడి గుండాల కోఆపరేటివ్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, స్థానిక డైరెక్టర్ సయ్యద్ హఫీజ్, పినపాక యువజన సంఘం నాయకులు ఆరీఫ్, ఆదం, సర్వేశ్, భాస్కర్, సంతోష్, సాయి, రాజేష్, సంతోష్, రాజు, కంచర్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు.