Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా ఎమ్మెల్యే మెచ్చా కేసీఆర్ సభకు హాజరు
- కాంగ్రెస్ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే తాటి ప్రచారం
- మకాం వేసిన చోటా-మోటా పేట నాయకులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
నువ్వా-నేనా అనే రీతిలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మరి కొన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల్లో తల పడుతున్నాయి. దీంతో ఆయా పార్టీలు 2 వేలు ఓట్లు ఉన్న పోలింగ్ బూతులుకు సైతం ఎమ్మెల్యే స్థాయి క్యాడర్‌ను ఇంచార్జిలుగా ఎంపిక చేసి ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో అశ్వారావుపేట నుండి పలు పార్టీల నాయకులు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. ఇందులో తాజా-మాజీ ఎమ్మెల్యేలతో పాటు చోటా-మోటా నాయకులు అక్కడే ఉండి ఆయా పార్టీల అభ్యర్ధుల విజయానికి చెమట ఒడుస్తూ నడుం బిగించారు. సోమవారం నుండి ఈ ప్రచారం ముగియనుంది. దీంతో టీఆర్ఎస్ నుండి స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదివారం మునుగోడులో కేసీఆర్ నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న 3 వేలు ఓటర్లు ఉన్న కొరటికళ్ళు, దుబ్బకాలువ పోలింగ్ బూత్‌లో మంత్రి అజరు అనుచరుడు అశ్వారావుపేట అభిమాని మోటూరి మోహన్ అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నాడు. అయితే మోహన్ మొదట్లో అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తాటి వెంకటేశ్వర్లుకు అత్యంత అనుచరుడిగా వ్యవహరించడం గమనార్హం. కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అక్కడనే మకాం ఉండి విస్తృత ప్రచారం చేస్తున్నారు. మునుగోడు నియోజక వర్గం కేంద్రం అయిన మునుగోడు మండలంలో పులిపలుపుల, బీరేల్లిగూడెం గ్రామాలకు ప్రచార ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరి వెంట మునుగోడు ముఖ్య నాయకులు జనగం వెంకన్న గౌడ్, మారయ్య, గోవర్ధన్, వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నాయకులు మొగుళ్ళపు చెన్నకేశవరావు, జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి, హరిబాబు, గాదెగోని వెంకటేష్ గౌడ్ వాసం వేణు తదితరులు పాల్గొన్నారు.