Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
- నేటితో ముగియనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు
- బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొననున్న పొంగులేటి
నవతెలంగాణ-కొత్తగూడెం
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర 7వ జూనియర్ వాలీబాల్ పోటీలు మిరిమిట్లు గొలిపే ప్లడ్లైట్లమధ్య హౌరాహౌరీగా వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గత మూడు రోజులు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆదివారం వాలీబాల్ పోటీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ కంచర్ల చంద్రశేఖర రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, తూ ము చౌదరి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రజాక్, కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎంసోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నప్పటినుంచే క్రీడల పట్ల యువతీ, యువకులు ఆసక్తి పెంచుకోవాలన్నారు. వారికి ఇష్టమైన క్రీడల్లో రానించాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందిస్తుందని తెలిపారు.
పోటీలు... విజేతలు
బార్సు విభాగంలో గెలుపొందిన వారు హైదరాబాద్ జట్టుపై ఖమ్మం జట్టు 3.1 తేడాతో గెలుపొందింది. మెదక్ జట్టుపై కరీంనగర్ 3.1 తేడాతో గెలుపు సాధించారు. అదిలాబాద్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 3.0 తేడాతో గెలుపు కైవసం చేసుకుంది. నల్లగొండ జట్టుపై వరంగల్ జట్టు 3.0 తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. గర్ల్స్ విభాగంలో మెదక్‌పై రంగారెడ్డి జట్టు 3.0 తేడాతో గెలుపు సాధించగా, హైదరాబాద్ జట్టుపై నల్లగొండ జట్టు 3.0 తేడాతో గెలుపు నమోదు చేసుకుంది. అదిలాబాద్ జట్టుపై ఖమ్మం జట్టు 3.0 తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. కరీంనగర్ జట్టుపై మహబూబ్ నగర్ జట్టు 3.0 గెలుపొందింది. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు, కార్యదర్శి హనుమంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి గోవింద్ రెడ్డి, కోశాధికారి ఎస్డి ఉస్మాన్, రాష్ట్ర అధ్యక్షులు పి.గణపతి, రవీందర్ రెడ్డి, ఎండి.అక్బర్ ఆలీ వాలీబాల్ కోచ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ పి.ఎస్ఆర్యూత్ సభ్యులు చీకటి కార్తి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఎండి.గౌస్, జల్లి కిరణ్, సుధాకర్ రెడ్డి, జెబి.మోహన్, అజరు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ముగింపు...హాజరుకానున్న పొంగులేటి
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న వాలీబాల్ క్రీడలు సోమవారంతో ముగియనున్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి ఏడవ జూనియర్ వాలీబాల్ పోటీల ముగింపు సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన వాటీబాల్పోటీలలో బార్సు, గర్ల్స్ విభాగాల్లో గెలుపొందిన జట్లకు మెమోంటోలు, బహుమతులు అందజేయనున్నారు. అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ముగింపు కార్యక్రమం, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి, పోటీల నిర్వహులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారని నిర్వహకులు తెలిపారు.