Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2016 నుండి ఆగిపోయిన తునికాకు బోనస్ ఇవ్వాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పెండింగ్లో ఉన్న ఉపాధిహామీ బిల్లులకు కూలీలకు వెంటనే విడుదల చేయాలని, 2016 నుంచి ఆగిపోయిన తునికాకు బోనస్ ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో ములకపాడు సెంటర్లో ఉన్న యలమంచి సీతారామయ్య భవనంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మచ్చా పాల్గొని మాట్లాడారు. గత రెండు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పనిచేసిన కూలీలకు ఇంతవరకు బిల్లులు రాకపోయేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా తునికాకు కార్మికులకు ఇప్పటివరకు ఏడు సంవత్సరాల పాటు బోనస్ ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలను కూడా వెంటనే తగ్గించాలన్నారు. అదేవిధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పతికి రూ.15వేలు ఇవ్వాలని, వరి ధాన్యానికి రూ.3000 ఇవ్వాలన్నారు. మండలంలో గిరిజన రైతులు త్రీ పేజ్ కరెంటు కోసం కట్టినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం గానీ, అధికారులు నుండి గాని ఎటువంటి స్పందన లేదన్నారు. తక్షణమే త్రి ఫేస్ కరెంటు ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు చేపడతాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు సరియం రాజమ్మ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, మర్మం సమ్మక్క, వాగే ఖాదర్ బాబు, కూరం వీరభద్రం, సోయం వీర్రాజు, మహమ్మద్ బేగ్, సోడి రాంబాబు పాల్గొన్నారు.