Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యలపై నగర మేయర్ పునుకొల్లు నీరజతో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి కలిసి ప్రజల కోసం ప్రజావాణి( గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని డివిజన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలకు ప్రజావాణి కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల పరిష్కరించటం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 33 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు , టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, రెవిన్యూ విభాగం అధికారులు, జనన మరణ, విభాగం అధికారులు పాల్గొన్నారు.