Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించాలి : టీఎస్ యుటిఎఫ్
నవతెలంగాణ-రఘునాథపాలెం
రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, పర్యవేక్షణ అధికారులు లేరని, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లేరనీ, ఉన్నత పాఠశాలల్లో సగటున రెండు సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు చెప్పారు. జిల్లాలో వెయ్యి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విద్యారంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రభుత్వం తొలగించాలని వెంటనే పదోన్నతుల బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని చేశారు. యన్.నర్మద అధ్యక్షతన జరిగిన 9వ మండల మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సిపియస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని 317 జిఓ అమలు కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని వారన్నారు.
నూతన మండల కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా సక్రాం, ప్రధాన కార్యదర్శిగా షేక్ జానీమియా, ఉపాధ్యక్షులుగా వి.ప్రసాద్, నలమల నర్మద, కోశాధికారిగా యన్.శేషగిరి, కార్యదర్శులుగా హబీబా బేగం, నీరజ, మురళి, రామారావు, జానయ్య, భవాని, ఆలస్యం, వెంకటేశ్వర్లు తదితరులు ఎన్నికయ్యారు.