Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-అశ్వాపురం
మండల కేంద్రంలో ప్రతి వారం నిర్వహిస్తున్న వారాంతపు సంత స్థలాలలో సంత నిర్వహణ నిలిచిపోవడంతో వ్యాపారులు అవస్థలకు గురయ్యారు. ప్రత్యామ్నాయంగా ఓ ప్రైవేటు వ్యక్తి స్థలంలో సంత నిర్వహణ కొనసాగినప్పటికీ చాలీచాలని స్థలం వలన చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరికొందరికి స్థలాలు దొరకకపోవడంతో తీసుకువచ్చిన కూరగాయలతో వెనుతిరిగి వెళ్లారు. వ్యాపారులకు ఆర్టీసీ నిర్వాహకులు గాని సంత నిర్వాహకులు గాని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో యధావిధిగా సోమవారపు సంతకు హాజరైన వ్యాపారులకు చేదు అనుభవం ఎదురయింది. తీరా సంతకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సులు బస్టాండ్ ఆవరణలోకి రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక సొంత వేలంపాటను పాడుకున్న వ్యక్తి లబోదిబోమంటూ విలపించాడు. అయినప్పటికీ రోడ్డు వెంట ఓ ప్రైవేట్ స్థలంలో తాత్కాలికంగా సంతకం నిర్వహిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులను కలగకుండా సర్పంచ్ బానోత్ శారద ఉపసర్పంచ్ చందులాల్ దగ్గరుండి పరిస్థితులను గమనించారు.