Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హత సాధించిన 260 మంది
నవతెలంగాణ-కూసుమంచి
పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించారు. ఇక్కడ శిక్షణ పొందిన సుమారు 260 మంది అభ్యర్థులు ఎస్సై మరియు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారని కందాల ఫౌండేషన్ నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. క్వాలిఫైయింగ్ విద్యార్థులు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు కోటి 50 లక్షలతో కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1500 మంది విద్యార్థులకు వివిధ పరీక్షలకు ఉచిత కోచింగ్, ఉచిత భోజన సదుపాయం, విలువైన ఉచిత మెటీరియల్ నిరుద్యోగులకు అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించిన నిరుద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో అవసరమైన ఫిజికల్ ట్రైనింగ్, మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్ సదుపాయం కల్పిస్తానని ఎమ్మెల్యే కందాళ హామీ ఇచ్చారు.త్వరలోనే కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తాం అని చెప్పారు..