Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
దేశ సమైక్యత సమగ్రత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు మధిర నుండి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 15 బస్సులలో బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం సెట్టి కిషోర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకట రమణ గుప్త జండాలను ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మదిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్, సేవాదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పాల్గొన్నారు.