Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
చట్టాల పట్ల అవగాహన కల్గి వున్నప్పుడే పౌరలకు ఆత్మ విశ్వాసం పెరిగి వారు బలోపేతం అవుతారని, ఈ ఉద్దేశాన్ని సాధించడానికే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 14 రోజల పాటు న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం న్యాయ సేవా సదన్‌లో రూపొందించిన క్యాంపెయిన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపెయిన్‌లో పాల్గొననున్న న్యాయవాదులు, పారా లీగల్ వాలెంటీర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో విధి విధానాలను సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా వివరించారు. గ్రామాలకు పారా లీగల్ వాలెంటీర్లు వెళ్ళి న్యాయ సేవా సంస్థ గురించి ఉచిత న్యాయ సహయాన్ని గురించి వివరించాలని సూచించారు. న్యాయపరమైన అంశాలకు పేదలకు సంస్థ అండగా వుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు, పోలీసు అధికారులు డాక్టర్ శబరీష్, సుబాష్ చంద్రబోస్ లు ప్రసంగించారు.