Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న అధికారులు పట్టించుకోని పోలీసులు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలోని ఆర్టీసి పాత బస్టాండు ఒకప్పుడు బస్సులతో, ప్రయాణికుల రద్దీతో ఆ ప్రాంతమంతా కలకలాడేది. జనాభా పెరిగిన దృష్ట్యా బైపాస్ రోడ్ లోని నూతన బస్టాండ్ స్థాపితం జరిగిన విషయం అందరికీ విదితమే. కానీ ప్రస్తుతం పాత బస్టాండ్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైంది. అందులోని కొన్ని వస్తువులను కొందరు ఆకతాయిలు, మరికొందరు పాత నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువులను అందరూ చూస్తుండగానే అపహరిస్తున్నారు. కూతవేటు దూరంలో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నా పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదున్నారు.
ప్రస్తుతం పాత బస్టాండ్ పాడుబడ్డ బంగ్లాగా మారింది. ఇది అసాంఘీక శక్తులకు అడ్డాగా మారింది. బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం బాత్ రూం చెందిన ప్లాస్టిక్ ట్యాంకులను రెండు రోజుల క్రితం దొంగలించారు. ఈ విషయాన్ని డయల్ 100 కాల్ చేసి దొంగను స్థానికులు పట్టించినప్పటికీ, పోలీసులు తీసుకెళ్లిన గంటలోనే ఆ దొంగను వదిలిపెట్టినట్లు సమాచారం. ఆ దొంగ ఇటీవల కాలంలో పాత బస్టాండ్‌లోని విలువైన వస్తువులను దొంగలించి అమ్మినట్లు సమాచారం.
పాత ఆర్టిసీ బస్టాండ్‌ను ఆర్టిసి కార్మికుల, ఉద్యోగుల కోసం ఆర్టీసీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిన అంశం ప్రజలకు గుర్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇక్కడ గతంలో వాడుకలో ఉన్న పనిముట్లు, పరికరాలను ఉన్నాయి. ప్రస్తుతం అవి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వ ఆస్తులుగా భావించి ప్రజా అవసరాలకు ఉపయోగించకుండా నిరుపయోగంగా వదిలివేయడంతో దొంగతనాలు అవకాశంగా తీసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రజాఅవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుతెన్నులు అటు ప్రభుత్వ అధికారులు, పోలీసులు సక్రమంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బస్టాండ్ ఆవరణంలో 20 పాత ద్విచక్రవాహనాలు ఉండేవి ఇప్పుడు అవి చోరీకి గురయ్యాయి.
మా దృష్టికి రాలేదు : సీఐ చిట్టిబాబు
చోరీ విషయం మా దృష్టికి రాలేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.