Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, వడేశ్వరం గ్రామానికి చెందిన పబ్బరాజు వెంకట యుగంధర్ మత్తుమందు ఇచ్చి ఒకరి మృతికి కారణమైన కేసులో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు ఇన్ చార్జ్ న్యాయమూర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు నిందితునికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు నేలకొండపల్లి మండలం, అజరు తండాకు చెందిన ఫిర్యాది బాణోత్ కిషన్ కథనం ప్రకారం అజరు తండాలో తమ తల్లిదండ్రులు రెండు గదుల ఇంటిలో నివాసం ఉంటున్నారని, 20-2-2020న నిందితుడు యుగంధర్ మోటార్ సైకిల్ పై వచ్చి తమకు ఇల్లు కిరాయికి కావాలని ఫిర్యాది తండ్రి అయిన వాల్యాని అడగాడు. వారు నివసిస్తున్న రెండు గదుల ఇంటిలో ఒక గదిని కిరాయికి ఇచ్చినారు. అడ్వాన్స్ గా రూ.2,000 లు ఇచ్చారు. తర్వాత తన గదిలో కిరాయికి దిగిన తర్వాత విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్లాడు. 24-2-2020న నిందితుడు రాత్రి 9 గంటల సమయంలో తాను తెచ్చిన తీర్థప్రసాదాలు తాగితే మీకు ఎటువంటి అనారోగ్యం సమస్యలు రావని, వారికి మాయామాటలతో తాగించాడు. తాగిన తర్వాత ఇరువురు సృహ కోల్పోయారు. తమ తల్లి మెడలో వున్న 2 తులాల బంగారు గొలుసు, నల్లపూసల గొలుసు, బీరువాలో వున్న రూ.80వేలను దొంగిలించి పారిపోయాడు.
25-2-2020న నేలకొండపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెల్లం ప్రతాప్ వాదించగా, లైజన్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వర్లు, రామారావు, చిట్టిబాబులు సహకరించారు.