Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు, వివిధ కంపెనీలలో, సంస్థల వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు సెక్యూరిగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 గంటల పని విధానం అమలు జరపాలని, ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాల నిర్వహించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం కార్పొరేట్లో ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేశారు. అనంతరం సింగరేణి సెక్యూరిటీ ఎస్ఓటు జిఎం జె.వేణుమాధవ్‌కి, లేబర్ ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ శంకరన్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య మాట్లాడారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసి సంక్షేమ చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సూరూం ఐలయ్య, జి.శ్యాం కుమార్, ఎస్.రామారావు, రాజేంద్ర ప్రసాద్, గౌస్ పాషా, శ్రీనివాస్ పాల్గొన్నారు.