Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. చంద్రశేఖర ప్రసాద్
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ, న్యూఢిల్లీ వారు ప్రవేశపెట్టిన ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్, హక్ హమారా అనే కార్యక్రమాల చేపట్టారనిజిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు. ప్రజలకు న్యాయ సహాయంను మరింత చేరువ చేసేందుకు అక్టోబర్ 31 నుండి నవంబర్ 13 వరకు గ్రామాలలో విస్తృతంగా న్యాయ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. లీగల్ సర్వీసెస్ అధారిటీ యాక్ట్ 1987 ప్రకారం ప్రతి పేదవానికి ఉచిత న్యాయ సహాయం అందించటమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.శ్యామ్ శ్రీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.భానుమతి, మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎ. నీరజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. రామారావు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. దీప, న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, ఎపిపి రాదా కృష్ణ మూర్తి పాల్గొన్నారు.