Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశం నుంచి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులను తరిమికొడితేనే కార్మికవర్గానికి, ప్రభుత్వరంగ సంస్థలకు మనుగడ ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా పునరుద్ఘాటించారు. ఏఐటియుసీ 103వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఆటో, భవన నిర్మాణ, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల అడ్డాలు, జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏఐటియుసి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ఆవిర్భావ సదస్సులో సాబీర్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటియుసి నాయకులు దమ్మాలపాటి శేషయ్య, వై. శ్రీనివాసరెడ్డి, జి.వీరస్వామి, వంగా వెంకట్, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, గెద్దాడ నగేష్, కిష్టాఫర్, వట్టికొండ మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం భద్రాచలం కార్ స్టాండ్‌లో ఏఐటీయూసీ 103వ ఆవిర్భావ దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆకోజు సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బి.సాయి కుమార్, మారెడ్డి శివాజీ, రాయల రాములు, అనిల్, గోపి, శోభన్, బైరు వరలక్ష్మి, ప్రసాదు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : ఏఐటీయూసీ ఆవిర్భవ దినోత్సవాన్ని ములకలపల్లి, రాజుపేట, పుసుగూడెం, జగన్నాధపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ జండా ఎగరవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమమంలో నాయకులు యూసుఫ్, జబ్బార్, పుల్లా రావు, వెంకన్న, కేశవులు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 103వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ సందర్భంగా మణుగూరు, కెఎల్ మహేంద్ర భవన్ల వద్ద జెండా ఎగురవేశారు. బ్రాంచ్ సెక్రటరీ రామ్ గోపాల్ మాట్లారు. బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ కందిమల్ల రామయ్యా, రామ్ నర్సయ్య, ఆవుల నాగరాజు, ఫిట్స్ సెక్రటరీలు సుధాకర్, శ్రీనివాస్, మల్లేష్, గంగాధర్, సురేందర్, సందీప్ దాట్ల, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.