Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతం చేయండి : పట్టణ కన్వీనర్ వై.వి.రామారావు
నవతెలంగాణ-భద్రాచలం
నేడు సీఐటీయూ జిల్లా మహాసభలు జయప్రదం కోరుతూ అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు ప్రభుత్వ విధానాలు కార్మికులు ఉద్యోగులపై ప్రభావం అనే అంశంపై సెమినారు నిర్వహించటం జరుగుతోందని, ఈ సెమినార్కు సీఐటీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి సీనియర్ నాయకులు ఎస్.వీరయ్య పాల్గొంటారని ఈ సెమినార్ను జయప్రదం చేయాలని పట్టణ కన్వీనర్ వై.వి.రామారావు తెలిపారు. సోమవారం బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సెమినార్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక చట్టాలు, ప్రభుత్వ విధానాల వలన కార్మికుల జరిగే నష్టాన్ని అదేవిధంగా కార్మిక సమస్యలు పరిష్కారానికి పోరాట మార్గాలు ఎలా ఉండాలని విషయాలను వివరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక, ఎన్.నాగరాజు, లక్ష్మణ్, రామకృష్ణ, సిహెచ్ రమేష్, రాము, ఎస్కే జాకీర్, అమలాపురం శ్రీనివాస్, యరం వెంకటేశ్వర్లు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.