Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ జరగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై డీఆర్డిఓ, సహకారశాఖ, జిసిసి, మార్కెటింగ్, వ్యవసాయ, తూనికలు కొలతల, రైస్ మిల్లర్స్ అసోషియేషన్ సభ్యులతో కార్యాచరణ ప్రణాళిక జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం వస్తుందనే అంచనాతో 148 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి అదనపు దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుగాలం క్రమించి రైతన్న పండించిన దాన్యానికి గిట్టుబాటు ధర కల్పనకు ప్రభుత్వం ఏ, బి గ్రేడ్ రకాలుగా ప్రకటించి మద్దుతు ధర కల్పించినట్లు చెప్పారు. ఏ- గ్రేడ్ దాన్యానికి రూ.2060లు, బి-గ్రేడ్ రకానికి రూ.2040లుగా మద్దుతు ధర కల్పించినట్లు వివరించారు. సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్, డిఆర్ డిఓ మధుసూదన్ రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, జీసీసీ మేనేజర్ వాణి, తూనికలు కొలతల అధికారి మనో హర్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, మార్కె టింగ్ అధికారి అలీం, రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షులు జుగల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.