Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీని కలిసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వందనపు సత్యనారా యణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిచాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రభుత్వాన్ని కోరార. సోమవారం ఎస్పీ వినీత్.జీ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు చారుగుళ్ల శ్రీనివాస్, తెలంగాణ ఉపాధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు ఎస్పీతో మాట్లాడారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి పల్లపోతు వాసు, కొత్తగూడెం, పాల్వంచ పట్టణ అధ్యక్షులు పల్లపోతు సాయిబాబా, చలువాది ప్రకాష్, కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జీ కూర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.