Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడలు స్నేహాన్ని పెంపొందిస్తాయి : పొంగులేటి
- ముగిసిన వాలీబాల్ పోటీలు
- విజేతలకు బహుమతులు ప్రదానం
నవతెలంగాణ-కొత్తగూడెం
నాలుగు రోజుల పాటు ఉత్సాహవాతావరణంలో సాగిన వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. సోమవారం చివరి రోజు సెమిఫైనల్స్, ఫైనల్ పోటీలు నిర్వహించారు. రాత్రి ఫైనల్ పోటీల క్రీడాకారులను జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు క్రీడాకానులు పరిచం చేసున్నారు. శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని తెలంగాణ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర 7వ జూనియర్ వాలీబాల్ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నాలుగో రోజు ముగిశాయి. చివరి రోజు క్రీడలు ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైనాయి ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య హాజరై మాట్లాడారు. ఓటమి గెలుపును సమానంగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు, కార్యదర్శి కార్యదర్శి ఎన్వి. హనుమంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి గోవింద్ రెడ్డి, కోశాధికారి ఉస్మాన్, రిఫరీ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షులు పి. గణపతి, కార్యదర్శి కె.రవీందర్ రెడ్డి, వాలీబాల్ కోచ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ ఎండి అక్బర్ అలీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, తుంబూరి దయాకర్ రెడ్డి, ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, తూము చౌదరి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు ఎండి. రజాక్, కార్పోరేట్ ఉపాధ్యక్షులు ఎం.సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెమీస్లో : నాలుగు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీలలో సోమవారం జరిగిన సెమీఫైనల్ బార్సు విభాగంలో వరంగల్ జట్టుపై ఖమ్మం జట్టు 3.0 తేడాతో గెలుపొందింది. రంగారెడ్డి జట్టుపై మహబూబ్ నగర్ జట్టు 3.2 తేడాతో గెలుపొందింది. గర్ల్స్ విభాగంలో మహబూబ్ నగర్ జట్టుపై వరంగల్ జట్టు 3.1 తేడాతో గెలుపొందింది. ఖమ్మం జట్టుపై నల్లగొండ జట్టు 3.0 తేడాతో గెలుపొందింది.