Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక తరగతులపై దృష్టి సారించండి
- ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలి
- నిర్లక్ష్య వైఖరి వహిస్తే కఠిన చర్యలు తప్పవు : పీవో
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటినుంచే పరీక్షలకు సన్నద్ధం చేసి ఉత్తమ ఫలితాలు వచ్చేలా సంబంధిత ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పొట్రు సంబంధిత ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు అందరూ పాఠశాలలోనే ఉండాలని, అదేవిధంగా చలికాలం దగ్గర పడుతున్నందున పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతిరోజు మెనూ ప్రకారం పౌష్టికరమైన ఆహారం అందించాలని కోరారు. సిలబస్ పూర్తి అయితే మరల రివిజన్ నిర్వహించాలని, సిలబస్ పూర్తి కాకపోతే సెలవు రోజుల్లో కూడా అధునపు తరగతలు తీసుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మొదలుకొని ఉపాధ్యాయులందరూ రాత్రిపూట వారి పని చేసే పాఠశాలల్లో బస చేయాలని కోరారు. కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏసీఎం ఓ.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.