Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల భారీ ప్రదర్శన, ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆదివాసులకు పేదలకు పంపిణీ చేయాలని పెద్ద ఎత్తున ఆదివాసి (జేఏసీ) జాక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి, సూపర్ బజార్ మీదుగా, బస్టాండ్ నుండి కలెక్టర్ వరకు వేలాదిగా ఆదివాసి ప్రజానీకం కదిలి వచ్చారు. కొద్దిసేపు కలెక్టరేట్ ఎదుర నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కి ఆదివాసి ప్రతినిది బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐకాస కన్వీనర్ వాసం రామ కృష్ణ దొర మాట్లాడారు. ములకలపల్లి మండలం పూసుగూడెం రెవిన్యూ లోని సర్వేనెంబర్ 241లో దాదాపు 63 ఎకరాల ప్రభుత్వ భూమిని గత 30 ఏళ్ల నుండి మహమ్మద్ సమీర్ అనే కేటీపీఎస్ ఉద్యోగి కబ్జా చేసుకుని ఆ 63 ఎకరాల్లో కోళ్ల ఫారం, కార్పొరేట్ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మాఫీయా నడుపుతున్నారని ఆరోపించారు. ఈ భూమిలో ఆదివాసీలు ఇళ్ల స్థలాలు లేని వారు ప్రస్తుతం 1000 గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని, వెంటనే వాళ్ళకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ ప్రదర్శనలో జాక్ నాయకులు సోయం చిన్నారి, సోయం సత్యనారాయణ, బాడిస బిక్షం, కోండ్రు పద్మ, ఎన్‌టిఎఫ్ ఉషాకిరణ్, తదితరులు పాల్గొన్నారు.