Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన
మణుగూరు : కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ డీజిల్, ధరలు తగ్గించాలని టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. సోమవారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయం ముందు మోటార్‌సైకిళ్లను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో తెలియజేశారు. అనంతరం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఎన్ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మట్టపల్లి సాగర్ యాదవ్, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి, ప్రసాద్, తురక రామకోటి, సందీప్ రెడ్డి, రాహుల్ గౌడ్, సృజన్, రమేష్ నాయక్, చరణ్, దుర్గాప్రసాద్, రాజేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.