Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ డిమాండ్
- కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, గౌరవ వేతనం మాకొద్దని, కనీస వేతనం ఇవ్వాలని, వీఓఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఓఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముందుగా వీఓఏలు కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయం నుండి భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం, బస్టాండ్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏజే.రమేష్ మాట్లాడుతూ ఐకేపీలో ప్రభుత్వం నిర్వహించే ప్రతి పథకాన్ని గ్రామస్థాయి వరకు డ్వ్రాక్రా గ్రూప్ సభ్యులకు చేరవేసే దానిలో వీఒఏ కీల పాత్ర పోషిస్తున్న తీరును వివరించారు. వారికి వస్తున్న అతి తక్కువ గౌరవ వేతనం సమయానికి ఇవ్వడం లేదని తెలిపారు. జి.ఓ.నెం-58 ప్రకారం గ్రామ సంఘం నుండి ఇవ్వవలసిన రూ.2,000ల వేతనం 2018వ సంవత్సరం నుండి ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతిరోజు చేస్తున్న ఎస్‌హెచ్‌జి అకౌంటింగ్, వీఓ కౌంటింగ్, ఎస్‌హెచ్‌జీ, వీఓ ట్రాన్సెక్షన్స్, ఆన్లైన్ సర్వేలు ఇవన్ని చేయడాని ప్రతి గ్రామ సంఘానికి ఒక ల్యాప్‌టాప్ ఇవ్వాలన్నారు. మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న, వీఏఓల సంఘం జిల్లా కార్యదర్శి అరుణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీను గోపాల్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కోశాధికారి చంద్రలీల, వీఏఓలు పాల్గొన్నారు.