Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస మూడో మండల మహాసభలో కనకయ్య, మచ్చా
నవతెలంగాణ-అశ్వాపురం
పోడు భూముల సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇచ్చే వరకూ పోరాడుదామని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్యలు పోడు సాగుదారులకు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని మంచికంటి భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం 3వ మండల మహాసభ దండి రాములు అధ్యక్షతన జరిగింది. తొలుత రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య జెండా ఆవిష్కరణ చేసి మహాసభను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెరిగిన, నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారూ. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బొడ్డు రాములు, ప్రధాన కార్యదర్శిగా మోకాళ్ళ రమేష్, ఉపాధ్యక్షులుగా దండి రాములు, సహాయ కార్యదర్శిగా రెడ్డిరాజుల శ్రీకాంత్‌లతో పాటు మరో 15మంది ఎన్నికయ్యారు. ఈ మహాసభలలో పాయం నర్సింహారావు, పిప్పల్ల అరుణ, ఉమ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.