Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీఓకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ పీఎంహెచ్ హాస్టల్స్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల 18 నెలల వేతన బకాయిలు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల మూడు నెలల వేతన బకాయిలను చెల్లించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలిసి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి, జిల్లా కార్యదర్శి హీరాలాల్ వేతనాలు లేక కార్మికులు పడుతున్న ఇబ్బందులను పీఓకు వివరించారు. 18 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణం వేతనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదు సంవత్సరాల సర్వీసు ఉన్న డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. బడ్జెట్ కోసం ప్రభుత్వానికి లేఖలు రాశామని సాధ్యమైనంత త్వరలో బడ్జెట్ వచ్చే విధంగా చర్యలు తీసుకొని బకాయి వేతనాలు చెల్లిస్తామని పీఓ హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. ఇతర సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వ విధానంతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వానికి పర్మినెంట్ సమస్యపై లేఖ రాస్తామని అందర్నీ పర్మినెంట్ చేయాలని కార్మికుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని ఐటీడీఏ పీవో తెలిపినట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ నాయకులు రాము, రమేష్, మధు, సుగుణ, జ్యోతి తదితరులు ఉన్నారు.