Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన ''హక్ హమారా భేతో హై క్యాంపెయిన్'' లో భాగంగా ఖమ్మం జిల్లా జైలులో వున్న ఖైదీల సంక్షేమం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. మంగళవారం న్యాయమూర్తి జైలులో క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దాయిలతో మాట్లాడుతూ కేసు వివరాలు, వాయిదా తేదీలు, కేసులో జాప్యం, కుటుంబ సభ్యుల విషయాలు, ఆరోగ్య సమస్యలు, అప్పీలు సంబంధిత అంశాలలో ఏవైనా సమస్యలు వుంటే ఈ క్యాంపెయిన్ కోసం నియమించిన న్యాయవాదులు, పారా లీగల్ వాలెంటీర్లు, న్యాయ విద్యార్థులకు తెలపాలని సూచించారు. ఈ విషయాంలో 29 అంశాలతో కూడిన ప్రశ్నావళిని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, గంగాధర్, శ్రీనివాస్, జి.కృష్ణ, న్యాయ విద్యార్థులు ప్రవళిక, నవ్య, రాధ తదితరులు పాల్గొన్నారు. వీరికి కావలసిన ఏర్పాట్లను జైలు పర్యవేక్షణ అధికారి ఎ.శ్రీధర్ సమకూర్చారు.