Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం
నవతెలంగాణ-వేంసూరు
మండల పరిధిలోని భరణి పాడు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులకు ఆట వస్తువులను మంగళవారం ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఆట వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందపాటి సునీత, మందపాటి మహేశ్వర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామారావు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.