Authorization
Fri March 28, 2025 05:28:39 am
నవతెలంగాణ-కల్లూరు
ప్రతి గర్భిణీని 84 రోజుల లోపు నమోదు చేసుకుని, వారికి అవసరమైన పరీక్షలు నెల నెల చేయించాలని, వైద్యాధికారి సురేష్ ఆశా కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ఆశా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుఖ ప్రసవం కొరకు మంచి పోషకహారం, చిన్న చిన్న వ్యాయామలు చేయించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించేలా చూడాలని, నావజాత శిశు సంరక్షణ, మాతృ సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రతి శిశువుకు పూర్తి వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలని, 2025వ సంవత్సరం నాటికి టిబి వ్యాధిని మన సమాజంలో లేకుండా చేయాలంటే వ్యాధి లక్షణాలు వున్న వారి తెమడ నమూనాలు పరీక్ష నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలని అన్నారు. అక్టోబరు నెలలో ప్రతి ఆశా సాధించిన లక్ష్యాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జె.రేవతి, కె.జయశ్రీ, జి.రామారావు, పి. విజయశ్రీ, చార్లెస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.