Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాపారాభివృద్ధి లక్ష్యం రూ.3కోట్లు
- ఎడ్యుకేషన్ రుణాలకు ఇబ్బంది పెట్టొద్దు
- డీసీసీబీ ఛైర్మెన్ కూరాకుల నాగభూషణం
నవతెలంగాణ- సత్తుపల్లి
ఈ ఆర్థిక సంవత్సరంలో ముద్రా రుణాలు ఇవ్వడానికి రూ.30కోట్లు కేటాయించడం జరిగిందని డీసీసీబీ ఛైర్మెన్ కూరాకుల నాగభూషణం తెలిపారు. మంగళవారం సత్తుపల్లి సహకార బ్యాంకులో ఆయా బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంతో ఛైర్మెన్ నాగభూషణం ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. బ్యాంకు పరిధిలో వ్యాపార విస్తరణకు రూ. 3కోట్లు లక్ష్యంగా పెట్టడం జరిగిందన్నారు. ఉన్నత చదువుల నిమిత్తం ఎడ్యుకేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిని ఇబ్బందులు పెట్టొద్దన్నారు. ఇచ్చేది, లేనిది ముందుగానే చెప్పాలన్నారు. అంతేగాని ఇదిగో, ఇదిగో అంటూ వారు ప్రయాణ సమయానికి ఇవ్వడం లేదని చెప్పడం వల్ల బాధపడిన ఘటనలు కొన్ని చోట్ల జరిగాయన్నారు. ఇకముందు అలా జరక్కుండా చూడాలన్నారు. చిరు వ్యాపారాలకు తక్కువ వడ్డీతో అంటే 12శాతంతో ముద్రా పథకం కింద రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తొలుత రూ. 50వేల వరకు రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. తరువాత వారి వ్యాపార వృద్ధిని బట్టి రూ. లక్ష నుంచి 2లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని నాగభూషణం అన్నారు. ఇవేగాక కర్షకమిత్ర పథకం ద్వారా భూమి అభివృద్ధి కోసం ఎకరానికి రూ.లక్ష నుంచి 2లక్షల వరకు రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రానున్న 6 నెలల కాలంలో వివిథ పథకాల ద్వారా బ్యాంకు తాలూకు నిమిత్తం వ్యాపారాన్ని వృద్ధి చేయాలని బ్యాంకు మేనేజర్లను ఆయన కోరారు. మార్చి నాటికల్లా విధించిన టార్గెట్లను పూర్తిచేయాలని ఛైర్మెన్ కోరారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో అట్లూరి వీరబాబు, డైరెక్టర్లు చల్లగుండ్ల కృష్ణయ్య, గొర్ల సంజీవరెడ్డి, నిర్మల పుల్లారావు, సొసైటీల అధ్యక్షులు, బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.